ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు వేడుకలను ఆగస్టు 22వ తేదీ శనివారం జరుపుకున్నారు. ఈ మేరకు ఆయనకు మెగా ఫ్యాన్స్‌తో పాటు.. సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, చిరంజీవి కూడా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

“అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు. నా పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. ఈ ప్రేమే నా జీవితాన్ని తీర్చిదిద్దింది. ఈ ప్రేమే నా జీవితంలో లభించిన మహత్తరమైన అదృష్టంగా భావిస్తాను. మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అంటూ పేర్కొన్నారు.