మహేష్ చేతుల మీదుగా ‘పెళ్లి సందD’ ట్రైలర్!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. గతంలో శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా… తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబు విడుదల చేశారు.

ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ ట్రైలర్ ను విడుదల చేశారు మహేష్. ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది అంటూ ట్వీట్ చేశారు. ఇక కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ను ట్రైలర్ లో చూపించారు. అలగే స్పోర్ట్స్ నేపథ్యాన్ని కూడా జోడించారు.