మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న తణుకు జనసేన నాయకుడు అనుకుల రమేష్

జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తణుకు నియోజకవర్గం లో పర్యటిస్తుండగా ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్న జనసేన నాయకుడు అనుకుల రమేష్ (అడ్వకేట్) , ‘ఇదే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దూషించిన ప్రతి , వైకాప మంత్రులను, ఎమ్మెల్యే లను క్షమాపణ చెప్పే వరకూ అడ్డుకుంటామని తెలియచేస్తున్నామని, ఈ సమయంలో జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటంతో ప్రతిఘటించి మరీ మననందరి తరుపున నిరసనను తెలియచేసినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కానూరి మాధవరాయుడు ,రుద్ర సతీష్, గుణ్ణం బాబి, కానూరి గంగాధర్,కిరణ్, సాయి మరియు జనసైనికులు పాల్గొన్నారు.