మూవీ ఆర్టిస్టులకు హీరో సూర్య 5 కోట్ల రూపాయల విరాళం

కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినిమా ఆర్టిస్టులకు హీరో సూర్య భారీ విరాళం ప్రకటించాడు. కరోనా కాలంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య సుమారు 5 కోట్ల రూపాయలను శనివారం విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయన్నారు.

కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్ట కాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. ఈ పరిస్థితుల కారణంగానే డిజిటల్‌ మీడియాలో ఆకాశమే హద్దురా సినిమాను విక్రయించామన్నారు. దీనిని అభిమానులతో సహా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని సూర్య అన్నారు.