రేపు కొత్త చెరువులో శ్రమదానాన్ని నిర్వహించనున్న జనసేనాని

జనసేనాని పవన్ కల్యాణ్ రేపు శ్రమదానాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలో ఆయన శ్రమదానంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం ఆయన పుట్టపర్తికి చేరుకుంటారు. అనంతరం శ్రమదానంలో పాల్గొని… ఆ తర్వాత కొత్తచెరువు జంక్షన్ వద్ద నిర్వహించే సభలో పాల్గొంటారు.

తొలుత రాజమండ్రి కాటన్ బ్యారేజీ వద్ద పవన్ కల్యాణ్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. అయితే, జనవనరుల శాఖ అధికారులు అందుకు అనుమతిని నిరాకరించారు. దీంతో శ్రమదానం వేదికను ఆయన మార్చారు.