ఓటుకు నోటులో ఈడీ కేసు విచారణ!

ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచార‌ణ నుంచి ఊర‌ట ల‌భించినా.. ఈడీ నుంచి మాత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చిక్కులు త‌ప్ప‌డం లేదు. నాంప‌ల్లి కోర్టులో ఆ సంస్థ‌ దాఖ‌లు చేసిన‌ మనీలాండ‌రింగ్ కేసు తాజాగా విచార‌ణకు వ‌చ్చింది. ఈ మేర‌కు కోర్టు విచారణ ప్రక్రియను ప్రారంభించింది. కేసులో ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ విచార‌ణ‌కు హాజరయ్యారు. వీరితో పాటు వేం కృష్ణ కీర్తన్, మత్తయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కూడా కోర్టుకు వ‌చ్చారు.

విచార‌ణ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తున్న‌ట్టు తెలిపిన నాంప‌ల్లి కోర్టు.. ఈడీ ఓటుకు నోటు కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 29కి వాయిదా వేసింది. మ‌రోవైపు ఇదే అంశంలో ఏసీబీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచారణను నవంబరు 1కి వాయిదా వేసింది నాంప‌ల్లి కోర్టు.