విశాఖ క్వారెంటైన్ సెంటర్ లో అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని ఓ క్వారెంటైన్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం కలగలేదు.

విశాఖపట్నం నగర పరిధిలోని మధురవాడ సమీపంలో కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్వారెంటైన్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంబవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని యాజమాన్యం భావిస్తోంది. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు స్థానికులు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేసి రోగుల్ని మరో బ్లాక్ కు తరలించారు. ఈ ప్రమాదంలో పెద్దఎత్తున కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి.