ఎఫ్ 3 టీమ్ దసరా స్పెషల్ విషెస్

అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎఫ్2. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఇందులో తమన్నా మెహరిన్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది.

కాగా దసరా సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ విషెస్ ను అందజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఎఫ్ 3 లో వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహరిన్ తో పాటు సునీల్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.