OTT లో ప్రదీప్ సినిమా

బుల్లితెరపై దూసుకుపోతున్న యాంకర్ ప్రదీప్‌ ఇంతవరకూ వెండితెరపై చిన్న చిన్న పాత్రలు పోషించిన ప్రదీప్ తన కెరీర్‌లో మొదటిసారి హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాలో నటించాడు. మార్చి 25న ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

ఈ సినిమాలోని “నీలీ నీలి ఆకాశం” పాట విడుదలకి ముందే అద్భుతమైన విజయాన్ని సాధించింది. యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఈ సాంగ్ 160 మిలియన్ వ్యూస్, 1 మిలియన్ లైక్‌లను సొంతం చేసుకుంది. దీంతో ప్రదీప్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఈ సినిమా నిర్మాతలు కరోనా తీవ్రత తగ్గి థియేటర్‌లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని గత 6 నెలలుగా వేచి చూస్తున్నారు. కానీ అది జరగడం లేదు.

అయితే తాజాగా ఈ సినిమాను OTT లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు చర్చలు జరుపుతునట్టు తెలుస్తోంది. త్వరలో ఒక ఒప్పందం ఖరారైతే.. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలిసే ఛాన్స్ ఉంది.