ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూత

సీనియర్‌ నటుడు, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు (64) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, కళ్యాణ వైభోగం, సింధూరం, సముద్రం, మళ్లీరావా, బ్రహ్మోత్సవం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. భరత్‌ అను నేను వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. బంగారు పంజరం, వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, చిల.సౌ.స్రవంతి, నా కోడలు బంగారం వంటి సీరియల్స్‌లోనూ నటించారు. 2005లో అమ్మ సీరియల్‌లోని పాత్రకుగానూ ఆయనకు నంది అవార్డు వరించింది.
1957 జూన్‌ 13న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేటలో రాజబాబు జన్మించారు. బాల్యం నుండి ఆయన నటనపై ఎంతో ఆసక్తిగా కనబరిచేవారు. దీంతో చిన్నతనంలోనే నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఈ క్రమంలో 1995లో వచ్చిన ఊరికి మొనగాడు చిత్రంతో రాజబాబు నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చిత్ర పరిశ్రమలో ఆయన్ను అందరూ బాబారు అని సంబోధిస్తుంటారు.

rajababu 4