85వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేస్తాం- కేటీఆర్‌

జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణాలపై కేటీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి జంటనగరాల్లో 85వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదలకు అందిస్తామని అన్నారు.

దాదాపు 8వేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున రెండు పడకల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. చాలా చోట్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో త్రాగునీరు, కరెంట్, రోడ్లు ఇతర సదుపాయాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సంవత్సరం డిసెంబర్‌ నాటికి జంటనగరాల్లో సుమారు 85వేలకు పైగా ఇళ్లను పేదలకు అందించనున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌నగరంలో జీహెచ్‌ఎంసి పరిధిలో పెద్దయెత్తున డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని అన్నారు. సుమారు 9వేల 700 కోట్ల రూపాయలతో దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత పెద్దయెత్తున జీహెచ్‌ఎంసి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం చే పడుతోందదని అన్నారు. పేదలకు పక్కా ఇళ్లనిర్మాణం కోసం ఇంత పెద్దయెత్తున దేశంలో ఏరాష్ట్రంలో కూడా కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు.

ఈ విషయంలో తెలంగాణ ముందు వరసలో ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసి నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం పై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ , హైదరాబాద్‌ జిలల్లాల కలెక్టర్లతో పాటు జీహెచ్‌ఎంసి హౌసింగ్‌ విభాగం అధికారులు, మున్సిపల్‌శాఖ అధికారులతో ఈసమావేశం జరిగింది.

డబుల్‌బెడ్‌రూమ్‌ఇళ్ల నిర్మాణం కోసం స్ధలాలు ఇచ్చినమురికివాడల్లోని ప్రజల లబ్ధిదారుల జాబితాను వెంటనే అప్‌లోడ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.