Tondangi: వీరాంజనేయ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులకు జనాసేన అండ

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భాగంగా ఎదుల్ల వీరాంజనేయ రిజర్వాయర్ ముంపునకు గురైన కొంకలపల్లి గ్రామానికి ప్రభుత్వం నుండి అందాల్సిన ఇళ్ల కేటాయింపు అందకపోవడంతో ఈ రోజు హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ జనసేనపార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ని కలిసిన కొంకలపల్లి గ్రామస్థులు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పడం జరిగింది. భాదితులకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ తో పాటు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు.