గంజాయి స్మగ్లింగ్ అనేది సామాజిక, ఆర్థికపరమైన అంశంగా చూడాలి.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన జనసేనాని

మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు..

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌ పాలిటిక్స్‌ తీవ్రస్థాయిలో విమర్శలు, బూతుల వరకు వెళ్లాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని లేవనెత్తిన జనసేనాని పవన్‌ కల్యాణ్.. మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.. 2018 నుంచి తాను గంజాయి స్మగ్లింగ్ విషయాన్ని హైలైట్‌ చేస్తూనే ఉన్నానని గుర్తుచేసిన ఆయన.. వైసీపీ హయాంలో గంజాయి స్మగ్లింగ్ మరింత పెరిగిందని ఆరోపించారు. ఇక, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో గంజాయి సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదన్నారు పవన్‌ కల్యాణ్.. 15-20 ఏళ్ల నుంచి గంజాయి సమస్య ఉందన్న ఆయన.. గంజాయి స్మగ్లింగ్ అనేది సామాజిక, ఆర్థికపరమైన అంశంగా చూడాలని సూచించారు. ఇక, గంజాయి స్నగ్లింగ్‌ను అరికట్టేలా వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. అందరికీ ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించాలని.. అందరికీ ఉపాధి లభించినప్పుడే గంజాయి వ్యాపారానికి అడ్డుకట్ట పుడుతుందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.