Narasapuram: నాయకర్ ఆధ్వర్యంలో మెగాబ్రదర్ బర్త్ డే వేడుకలు

సినీనటుడు, జనసేన పార్టీ నాయకుడు కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) జన్మదిన వేడుకలను నరసాపురం జనసేనపార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నర్సాపురం రాయపేట జనసేనపార్టీ కార్యాలయంలో నాగేంద్రబాబు బర్త్ డే కేకును బొమ్మిడి నాయకర్ కట్ చేసి నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం స్థానిక చినకనకదుర్గమ్మ ఆలయం వద్ద అమ్మవారికి నాగేంద్రబాబు పేరుమీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ నాగేంద్రబాబు బాల్యం నుంచి సేవాభావాలు కలిగిన వ్యక్తని, మానవీయ కోణంలో ఆలోచిస్తూ అపన్నులను ఆదుకోవడంలో నాగబాబు ముందువరుసలో ఉంటారని, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్లాస్మాను దానం చేసి అందరికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల రథసారథి, వారధి నాగేంద్రబాబు అని నాయకర్ అన్నారు. పురాతన చినకనకదుర్గమ్మ వారి ఆశీస్సులు నాగబాబుకి, ఆయన కుటుంబ సభ్యులకు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు భారతి సురేష్, కొప్పాడ కృష్ణవేణి, బందెల రవీంద్ర, నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, మాదంశెట్టి కోటేశ్వరరావు, వాతాడి కనకరాజు, గంటా వెంకటకృష్ణ, దీవి సత్యన్, ఆకుల వెంకటస్వామి, తోట శ్రీధర్, కొపల్లి శ్రీనివాస్, జక్కం బాబ్జి, పొలిశెట్టి నళిని, అంబటి అరుణ, కొణిదెల శ్రీను, వడ్డీ అకేశ్, వట్టిప్రోలు సతీష్, పొలిశెట్టి సాంబ, యతాం మహేష్, శ్రీరామ్, పసుపులేటి అభి మరియు నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు మరియు యువత పాల్గొన్నారు.