నవంబర్ 19 నుంచి కొణిదెల నిహారిక ‘ఓసీఎఫ్ఎస్’ స్ట్రీమింగ్
మెగా డాటర్ నిహారిక పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు, టీవీ షోలకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ‘ఓసీఎఫ్ఎస్’ వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఆమె నటించడం లేదు. దీనికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఓసీఎఫ్ఎస్’ అంటే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ స్టోరీతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ ప్రీమియర్స్ జీ5లో నవంబర్ 19న ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా నిహారిక ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘అమ్మ నాన్న ఒక బేవార్స్ కొడుకు’కు మించి ఉంటుంది వీళ్ల ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అని అన్నారు. ఈ సిరీస్ లో సంతోష్ శోభన్, సిమ్రన్ శర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు నరేశ్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుందని యూనిట్ సభ్యులు ధీమాగా ఉన్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20211030fr617d0ba0838ca.jpg)
Amma Nanna Ammamma oka bewars Koduku inthaku minchi untundhi veella #OkaChinnaFamilyStory!#ZEE5Originals #OkaChinnaFamilyStoryOnZEE5 #Premieres19thNov#SangeethShobhan #SimranSharma #MaheshUppala @ItsActorNaresh @getupsrinu3 @radhakrishnaven @ZEE5Telugu #PinkElephantPictures pic.twitter.com/c6stOo4wad
— Niharika Konidela (@IamNiharikaK) October 30, 2021