Vizag: పవన్ కళ్యాణ్ సభాప్రాంగణంను పరిశీలించిన డిసిపి, ఏసిపి మరియు ట్రాఫిక్ పోలీసులు

పవన్ కళ్యాణ్ సభాప్రాంగణంను పరిశీలించిన డిసిపి, ఏసిపి మరియు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ను మళ్ళించడానికి అలాగే సభాప్రాంగణంకి పవన్ కళ్యాణ్ కాన్వయ్ కు రహదారిని జనసేన నాయకులను అడిగి తెలుసుకున్న పోలీస్ ఉన్నత అధికారులు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంకి భారీ స్థాయిలో వేదికను సిద్ధం చేస్తున్న పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ ప్రసంగం చేసే సభ స్థలంకి అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో సహ జనసేనపార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉండటం అధికారులు ఏర్పాట్లును దగ్గరుండి పరిశీలీస్తున్నారు.