కోడెల శివరామ్‌ గృహ నిర్బంధం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా నేత కోడెల శివరామ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ‘చంద్రన్న ఆశయ సాధన’ పేరుతో శివరామ్‌ ఇవాళ రాజుపాలెం నుంచి దేవరంపాడు వరకు యాత్ర చేపట్టానికి సిద్ధమయ్యారు.

కాగా పాదయాత్రకు అనుమతి లేదన్న పోలీసులు.. ఆయన ఇంటి వద్ద మోహరించారు. శివరాం బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలోని తెదేపా నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు.