మెగాస్టార్@154 ప్రాజెక్ట్ షురూ.. మాస్ లుక్‌లో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్ షురూ అయ్యింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది.
చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా బాబీ.. చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. చిరు లుక్ చూసి అభిమానులు ఈలలు వేస్తున్నారు. ‘మాస్ పూనకాలు మొదలాయే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.