ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి మూల విరాట్‌ను, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల మట్టి గాజులతో సుందరంగా ముస్తాబు చేశారు.

సుమారు 2 లక్షలకుపైగానే గాజుల దండలతో అలంకరించారు. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేయనున్నారు.