‘డేగల బాబ్జీ’ ట్రైలర్‌ రిలీజ్

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘డేగల బాబ్జీ’ ట్రైలర్ ను ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రిషి ఫిలింస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో పార్తీబన్ హీరోగా వచ్చిన హిట్ చిత్రం ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ చిత్రానికి తెలుగు వర్షన్ ఈ సినిమా.

ఇటీవల విడుదలైన ‘డేగల బాబ్జీ’ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ‘మీ అభిమానం కావాలి. మీ అండ కావాలి. మీరే నాకు కొండంత బలం. వస్తున్నా’ అని ట్వీట్ చేశారు. సినిమా ట్రైలర్ మీరు కూడా చూడండి.