భోళా శంకర్ లో చిరుకు జంటగా మిల్కీ బ్యూటీ – అఫిషియల్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా కంప్లీటైంది. ఈ సినిమా తర్వాత మలయాళీ రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్  అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అన్నాచెల్లెల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో తమన్నాను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసారు. కాగా తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సైరా.. నరసింహారెడ్డి’ చిత్రంలో తమన్నా  తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవితో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ 11నుంచి లాంఛనంగా ప్రారంభంకానుంది. అదే నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.