Amalapuram: ఈదరపల్లి సర్పంచ్ జనసేన కైవసం

శ్రీమతి వరలక్ష్మి ఎన్నిక ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ మినీ పంచాయితీ పోరులో జనసేన పార్టీ బోణీ కొట్టింది.

తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం రూరల్ మండల పరిధిలోని ఈదరపల్లి నుంచి జనసేన పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన శ్రీమతి రాయుడు వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం, సర్పంచ్ పదవికి ఒకే అభ్యర్ధి నామపత్రం దాఖలు చేయడంతో గ్రామ సచివాలయం సెక్రటరీ శ్రీ సీ.హెచ్. సత్యనారాయణ మూర్తి ఫారమ్ – 29 పై ఆమెకు దృవీకరణ పత్రం అందచేశారు.