పేకాట కేసులో హీరో నాగ శౌర్య తండ్రి అరెస్ట్


టాలీవుడ్ హీరో నాగ శౌర్య తండ్రి అరెస్టయ్యారు. మంచిరేవుల ఫామ్ హౌస్ పేకాట కేసులో శివలింగ ప్రసాద్ ను అరెస్ట్ చేశారు . శివలింగ ప్రసాద్ నాగశౌర్య మేనమామ సుమన్ తో కలసి పేకాట ఆడిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే శివలింగ ప్రసాద్ ను కోర్టులో హాజరు పరిచారు. ఇక ఈ కేసులో పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు.

గెస్ట్ హౌస్ లను, ఫామ్ హౌస్ లను రెంటుకు తీసుకొని నాగశౌర్య మేనమామ సుమన్ పేకాట ఆడిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దీనికి మొత్తం సూత్రధారి నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ గా కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే శివలింగ ప్రసాద్ ను అరెస్టు చేశారు.

Naga Shaurya Height, Age, Girlfriend, Wife, Family, Biography & More -  BigstarBio