రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి: సీఎం జగన్
రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు లబ్ధిదారులుకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 21న ప్రారంభించనున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. నిర్ధేశించుకున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఎంక్వెరీలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ నవంబర్ 20 నుంచి ప్రారంభం. డిసెంబర్ 15 వరకూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. పథకం అమలుపై దిగువస్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఇప్పటివరకూ 52 లక్షలమంది ఈ పథకం కింద నమోదు చేశామని, 45.63 లక్షల లబ్ధిదారుదాల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేసి ఉందని అధికారులు తెలిపారు. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.