కరీంనగర్ విద్యుత్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్ లోని ఎన్ పిడిసిఎల్ కార్యాలయ సమీపంలోని ఎలక్ట్రిసిటీ స్టోర్ లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందలాది ట్రాన్స్ ఫార్మర్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.