Tirupati: తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి – జనసేన డిమాండ్

రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన డిమాండ్

రుయా ఆసుపత్రి నుంచి తొలగించిన ఎంఎన్ఓ, ఎఫ్ఎంఓ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకురావాలని జనసేన పార్టీ తిరుపతి నేతలు డిమాండ్ చేశారు. కోవిడ్ కష్టకాలంలో సేవలు అందించిన సిబ్బందిని తొలగించడం అమానుష చర్యన్నారు. తమను విధుల నుంచి తొలగించారంటూ ఎంఎన్ఓ, ఎఫ్ఎంఓ సిబ్బంది గత 31 రోజులుగా చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. స్థానిక జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు, రుయా ఉన్నతాధికారులు సహృదయంతో స్పందించాలని ఈ సందర్భంగా జనసేన నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.