స్థానిక ఎన్నికల్లో పోరాడిన జనసేన అభ్యర్థులకు అభినందనలు తెలిపిన జనసేనాని

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలతోపాటు, పరిషత్, పంచాయతీ, మున్సిపాలిటీలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. జనసేన పక్షాన నిలిచి పోరాడిన ప్రతి అభ్యర్థికీ హృదయపూర్వక అభినందనలు. ఈ ఎన్నికలకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలిచారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన అభ్యర్థులకు శుభాకాంక్షలు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగింది. క్షేత్ర స్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా ప్రస్తావించి, ప్రజల పక్షాన నిలవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు.