Kothapeta: రాష్ట్రానికి ఆశాదీపం, తిరుగులేని నాయకుడు జనసేనానే !!

జన సైనికులారా!
మీరంతా ఐకమత్య బలంతో అన్ని వర్గాలను మరింత ఆదరించండి!
అందరితో కలిసి మెలిసి ప్రయాణం చేయండి!
సమయం లేదు మిత్రమా!
జనసేనానికి అండగా నిలబడదాం.. తిరుగులేని నాయకుడుగా గెలిపిద్దాం!
రాబోయే భవిష్యత్ భావితరాలకు, ఒక అన్నగా, ఒక అండగా, రాష్ట్ర ప్రజలకు పెద్దన్నగా జనసేనాని మాత్రమే ఈ రాష్ట్రాన్ని రక్షించగలడు!

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గంలోని, జనసేన పార్టీ నాయకత్వం చాలా పటిష్టమైన స్థితిలో రోజురోజుకు అందరి అంచనాలను దాటి, అన్ని వర్గాలవారిని ఆదరిస్తూ, అన్ని కులాలు, మతాల వారితో కలిసి ప్రయాణం చేస్తున్న కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వం చాలా గొప్పగా, ఎంతో బలంగా ఉన్నదని, కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పలు గ్రామాలలో ప్రజలు ఇప్పటికే ఒక ఆలోచనలో, జనసేనానికి మద్దతుగా పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారని, ఏ కష్టం వచ్చినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే మొట్టమొదట వ్యక్తిగా బండారు శ్రీనివాస్ నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని, నియోజకవర్గంలో జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు ఎంతో ఐకమత్యంతో నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో ఏకతాటిపై నడుస్తున్నారని, ఈ సందర్భంగా ప్రముఖ శెట్టిబలిజ బిసి నాయకులు, జనసేన పార్టీ సేవాదళ్ వ్యవస్థాపక నాయకులు రాయుడు లక్ష్మణరావు తెలియజేస్తూ, ప్రతి గ్రామంలోనూ శెట్టి బలిజ, బీసీ సోదరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి జనసేనానికి అండగా మేము సైతమని ఖచ్చితంగా నిరూపిస్తానని, కుల, మతాలు లేని నాయకుడు, పేదల పెన్నిధి, నీతిమంతుడు, నిజాయితీపరుడు, అవినీతి మచ్చలేని నాయకుడు, మానవతావాది సేవాతత్పరుడు, కష్టాల్లో ఉన్నవారికి కన్నీళ్లు తుడవ గలిగే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ వారిని గెలిపించాల్సిన అవసరం, కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కుల రాజకీయాలు పోవాలంటే జనసేనానిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గెలిపించాలని, గెలిపించి తీరాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు.