మత్స్యకారుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి

జనసేనపార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి -పొక్కింగారి రాజు

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు. మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపాలంటే మత్స్యరంగ అభివృద్ధితో పాటు మత్స్యకారులలో పేదరిక నిర్మూలనకు ఎంతో కృషి చేయాలి. ఏపీలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, మత్స్యకారుల జీవితాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సివస్తుంది. పెద్ద సముద్రం ఉన్నా అవసరమైన ఫిషింగ్‌ హార్బర్లు లేవు. దేశంలోనే సముద్ర తీర ప్రాంతాల్లో ఆంధప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వేట నిషేధ సమయంలో ఆదాయం కోల్పోయిన ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
పెట్రోలియం కార్పొరేషన్‌ కార్యకలాపాల ఫలితంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంది. వేట నిషేధ కాలంలో పరిహారం పెంచాలి. మహిళా మత్స్య కారుల అభివృద్ధికై ఆర్ధిక భరోసా కల్పించాలి. వేటకెళ్లి తిరిగిరాని మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం పెంచడంతోపాటు వారికి అండగా ప్రభుత్వం పరిహారం సత్వరమే అందేలా చూడాలి. మత్స్యకారులకు అండగా ఆదరణ పథకాన్ని తేవాలి. మత్స్యకారుల గృహనిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలి. మత్స్యకారుల సంక్షేమానికి భారీగా బడ్జెట్ పెంచాలని కోరుతున్నాము. ఎస్టీల్లో చేర్చాలన్న మత్స్యకారుల డిమాండును నెరవేర్చే కృషి చేయాలి. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని జనసేనపార్టీ మత్స్యకార వికాస విభాగం తరుపున డిమాండ్ చేస్తున్నానని జనసేనపార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి పొక్కింగారి రాజు తెలిపారు.