యువక్రీడాకారుని ప్రోత్సహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలం, మిట్టగూడెం గ్రామానికి చెందిన “బానోతు అజయ్” అనే గిరిజన యువ క్రీడాకారుడు స్వయం కృషితో షార్ట్ పుట్ గేమ్ లో నేషనల్ లెవల్లో గతంలో మంచి ప్రతిభను కనబరిచాడు. ది 25-11-2021 నుండి ది 29-11-2021వరకు గోవాలో నిర్వహిస్తున్న షార్ట్ పుట్ జాతీయ స్థాయిలో పాల్గొనటానికి ఆర్థిక స్తోమత లేని కారణం వలన పాల్గొనలేక పోతున్నానని ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగానికి తెలియజేయడం జరిగింది. సహృదయంతో స్పందించిన జనసేన పార్టీ తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వంగా లక్ష్మణ్ ఆదేశాలనుసారం ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీ డేగల రామచంద్రరావు ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ భానోత్ రాంబాబు ప్రయాణ ఖర్చులు గాను 15 వేల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షులు శ్రీ డేగల రామచంద్రరావు మరియు ప్రధాన కార్యదర్శి మెడ బోయిన కార్తీక్ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట యాసంనేని అజయ్ కృష్ణ, మిరియాల శివాజీ, బాకీ సునీల్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ కోట్ల రామకృష్ణ, మైలవరపు మణికంఠ, సెక్రటరీ మార్గం సందీప్, గరిక రాంబాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గుండ్ల పవన్ కళ్యాణ్, కంభంపాటి నాగసాయి, సారధి ప్రదీప్, రాకేష్, తెనాలి దినేష్, పసుపులేటి కిషోర్ నాయుడు, గుంత సత్యనారాయణ, లింగాల పుల్లారావు, బానోత్ జగ్గారావు, గోవిందా అన్వేష్, లకావత్ రమేష్ ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన కార్యకర్తలు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.