గౌతమ్ కి జన్మదిన శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఈ రోజు 14వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గౌతమ్ చిన్నప్పటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ మహేష్ బాబు, నమ్రతలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇక సితార కూడా తన అన్నయకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపింది.

మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా గౌతమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ” మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడిగా నువ్వు పెరిగి పెద్దగా అవుతున్నందుకు గర్వంగా ఉంది. డొరేమాన్ టు అపెక్స్ లెజెండ్ వరకు నీతో కలిసి నేను జర్నీ చేయడం హ్యాపీగా ఉంది. నీకిది గొప్ప పుట్టినరోజు కావాలి” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

నమ్రత గౌతమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. “నువ్వు మా జీవితాల్లోకి వచ్చాక ఎంతో మార్పు వచ్చింది. సంతోషం, ప్రేమను తెచ్చావు. ప్రతి ఏడాది ఇలానే జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతూ రావాలి”అంటూ విషెస్ ని అందించింది.