రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వ విధానాలపై బోడపాటి రాజేశ్వరి తీవ్ర ఆగ్రహం!

తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలంలోని, కడియపులంక, పొట్టిలంక పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, తీవ్రత తుఫానులకు, వరి పంటచేలు కోతకు వచ్చిన దశలో తీవ్ర గాలులు వర్షాలు కారణంగా పంట చేలు నేలకొరిగి మట్టిలో కలిసిపోయిన ధాన్యపు కంకులతో కూడిన వరి పంటచేలని చూస్తుంటే, ఎవరికైనా కన్నీళ్లు వస్తున్నాయనీ, ఇలాంటి సంఘటనకు ప్రాణము దహించుకుపోతుంది, ఇలాంటి కష్టాల్లో ఉన్న రైతులను, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా గాలిలో తిరుగుతూ ఉంటే పంట నష్టాన్ని ఎలాగ అంచనా వేస్తారనీ, వారి కంటికి, కుళ్ళు పోయిన వరిపంట చేను పైనుంచి పూర్తిగా ఎలా కనబడుతుందని, అధికారం లేనప్పుడు పంట చేలు తుఫానులతో కుళ్ళు పోయి ఉన్నప్పుడు వర్షంలో వరి పంటచేలలో ప్రతిపక్ష నాయకుడిగా దిగిన జగన్మోహన్ రెడ్డికి, ఆనాడు రైతులను పలకరించిన జగన్ మోహన్ రెడ్డికి, ఈరోజు అధికారం రాగానే గాలిలో తిరిగే హెలికాప్టర్లో తిరుగుతూ చెక్కెర్లకొడుతూ పంట నష్టపోయిన రైతులను ఏమి ఉద్దరిస్తారని, నేలపై తిరిగి, కుళ్ళిన పంటచేలలో కాలు పెట్టి పంటచేలోకి దిగి, రైతులు పడుతున్న కష్టాలను, దారుణ పరిస్థితులను చూస్తే, రైతు పడే బాధలు, కష్టాలు నష్టాలు, కన్నీళ్లు అర్థం అవుతాయని, అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక విధంగా ఒంటెద్దు పోకడతో పరిపాలన చేయడం చాలా దారుణంమని, ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వచ్చి నేలపై నడిచి రైతు కష్టాలను కన్నీళ్లను తుడవాలని, ప్రభుత్వ విధానాలు చూస్తుంటే పేదలు, పేద రైతులు బతికే పరిస్థితి కనబడటం లేదని, జనసేన వీర మహిళ బోడపాటి రాజేశ్వరి కడియపులంక గ్రామం పరిసర ప్రాంతాల్లో వరి పంట పొలాలను చూసి తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వెంటనే పంటలు నష్టపోయిన రైతులకు సరైన న్యాయం చేసి ఎకరాకు 30 వేల రూపాయలు పైగా నష్టపరిహారం ఇప్పించాలని సందర్భంగా రాజేశ్వరి డిమాండ్ చేస్తున్నారు.