పాలకులు రాజ్యాంగ ధర్మం ఆచరించేలా ప్రతీపౌరుడు బాధ్యత తీసుకోవాలి – కాటం అశ్విని

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళ, చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి అశ్విని మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభమైన భారత రాజ్యాంగం పార్లమెంట్ లో ఆమోదం పొంది నవంబర్ 26 నాటికి డెబ్బైఏళ్లు నిండాయని, దేశానికి దశ దిశల్ని చూపిస్తూ ముందుకు నడిపిస్తున్న రాజ్యాంగం ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని,పాలకులు రాజ్యాంగ ధర్మం ఆచరించేలా ప్రతీ పౌరుడు బాధ్యత తీసుకోని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దాసరి యోగేష్, కిలారి ప్రసాద్, బూర వాసు, సాయి పాల్గొన్నారు.