పేదల కాలనీలో నివసిస్తున్న ప్రజల కష్టాలు పట్టవా! ఇళ్లకు రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేయడం తగదు! ఒక్క రూపాయికే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయి? బండారు శ్రీనివాస్ జనసేన ఇంచార్జ్!

పేదల కాలనీ పాత, కొత్త ఇళ్ళకు, స్థలాలకు రిజిస్ట్రేషన్లు పేరుతో డబ్బులు వసూలు చేయడం తగదు! ఒక్క రూపాయితో పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలు ఏమయ్యాయి? బండారు శ్రీనివాస్ జనసేన ఇంచార్జ్ ప్రశ్నిస్తూ…

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్, గత పదిహేను, ఇరవై రోజులుగా అనేక గ్రామాల్లో తిరుగుతూ, కొత్తపేట నియోజకవర్గం నాలుగు మండలాల్లో పలువురి పేదలు పాతకాలనీ ఇళ్ల వారు, కొత్త కాలనీలోని ఇల్లు నిర్మించుకునే వారు పడుతున్న ఇబ్బందులను, బాధలను గమనిస్తూనే ఉన్నానని, వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నానని, ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కాలనీలకు చెందిన దళితులు, బీసీలు, కాపులు, మైనారిటీలు, అగ్ర వర్గంలోని నిరుపేదలు వారి దగ్గర్నుంచి ఇళ్లకు రిజిస్ట్రేషన్ ల పేరుతో డబ్బులు వసూలు చేయడం తగదని, నిరుపేద ప్రజలు పడుతున్న బాధలు గమనించరా! అని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నాను. అసలే, గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయిన పేద కుటుంబాలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సతమతమవుతున్న పేద కుటుంబాల దగ్గరనుంచి, ఇళ్లకు రిజిస్ట్రేషన్ ల పేరుతో డబ్బులు వసూలు చేయడం తగదని, ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలో లేనప్పుడు, నాకు అధికారం ఇవ్వండని, పేదలకు ఉచితంగా ఒక్క రూపాయికే ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేస్తానన్న మాటలు ఏమయ్యాయని, ప్రజలు ఎంత ఇబ్బందులకు గురి అవుతున్నారో, ఒక్కసారి గ్రామాల్లోకి వచ్చి పేద కాలనీలో నివాసం ఉంటున్న వారి సమస్యలను తెలుసుకుని, ఉచితంగా ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని, మీరు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రికి సూచన చేస్తూ, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాసు ప్రెస్ కు, ఈ సందర్భంగా తెలియజేశారు.

No photo description available.