పవన్ బర్త్ డే గిఫ్ట్ రెడీ చేసే పనిలో ఉన్న హరీష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2 సాయంత్రం 4:05 నిమిషాలకి ఈ సినిమా నుంచి అప్ డేటు రాబోతుంది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్ చేసింది.

దాన్ని రీ ట్విట్ చేసిన హరీష్.. యస్.. యస్.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలిపారు. పవన్, హరీశ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ కాంబోలో మరో సినిమా అంటే అంచనాలు బారీ రేంజ్ లో ఉండబోతున్నాయి.