పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 27వ సినిమా ప్రీ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, ఇలా అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే వకిల్ సాబ్ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది రిలీజ్ అయి ట్రెండింగ్ అవుతున్న.. కొద్దిసేపటికే అభిమానులకు మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది.

ఆయన 27వ సినిమా అప్‌డేట్ వచ్చేసింది…క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 27వ సినిమా ప్రీ లుక్ విడుదలైంది. చిత్ర యూనిట్ ప్రీ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే ఈ సినిమా టైటిల్ ను మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని ట్వీట్ చేసింది.

అయితే.. ప‌వ‌న్ 27వ సినిమా ప్రీ లుక్‌లో చేతికి క‌డియం, న‌డుము, మెడలో ఎర్ర‌ని కండువా, బ్లాక్ షర్ట్‌లో కనిపిస్తున్నారు. అయితే ఆయన పూర్తి ఫొటో కనిపించనప్పటికీ.. ఈ చిత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి స‌రికొత్త జోష్‌ను ఇస్తోంది. ఇందులో పవన్ క్యారెక్టర్ ఉద్యమకారుడి పాత్రలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందిస్తుండగా.. సంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు. అయితే పవన్ సరసన ఎవరు నటిస్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.