పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోలేక పోవడం ఆ ప్రాంత ప్రజల దౌర్భాగ్యం: ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్షలో పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్. ఈ కార్యక్రమంలో శ్రీ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ 1970లో ఎంతో మంది త్యాగఫలం వలన స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘనమైన చరిత్ర కలిగినదని, నుంచి సొంత గనులు లేకపోయినా లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంట్ ను, ఇప్పుడు నష్టాల బాట పట్టిందని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రస్తుతం అప్పుల్లో ఉందని కావున రాష్ట్రాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారా అని నిలదీశారు. గాజువాకకు దేవుడిలాగా వరమిచ్చిన పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోలేక పోవడం ఆ ప్రాంత ప్రజల దౌర్భాగ్యమని, అదే శ్రీ పవన్ కళ్యాణ్ ని గెలిపించి ఉంటే ప్రైవేటీకరణ ఆలోచన స్టీల్ ప్లాంట్ గేట్ వరకు కూడా వచ్చేది కాదని తెలిపారు.