విశాఖఉక్కు ఫ్యాక్టరీ మన హక్కు!జనసేనాని పిలుపుకు మేము సైతం! చైతన్యవంతులైన యువత, మహిళలు, జనసైనికులు! బండారు శ్రీనివాస్ జనసేన నేత

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ తన నియోజకవర్గంలో విశాఖ ఉక్కు పోరుపై, జనసేనాని ఇచ్చిన పిలుపుకు స్పందించి, డిజిటల్ పోరుకు పోరాడాలని, జన సైనికులకు, యువతకు ఇచ్చిన పిలుపుపై నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పలువురు జనసేన వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు అండగా నియోజకవర్గ జనసేన నేతతో కదంతొక్కారు. ఈ కార్యక్రమంలో బండారుశ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్ర రాష్ట్రం ఐకమత్యంతో, కొంత మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నదని, ఇది భావి తరాల యువత, చదువుకున్న యువతీ యువకుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే, ధనరాశితో కూడిన భాండాగారము లాంటిదని, ఇది మన రాష్ట్రానికి ఒక గొప్ప జాతీయ స్థాయి ఉక్కు ఫ్యాక్టరీ అని, గతంలో ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీల వల్ల ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదాను సాధించుకోలేక,మన నాయకులు చతికిల పడ్డారు. ఇప్పుడు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవడంలో వెనకబడి పోతున్నారని, ఈ విషయంలోనూ, ప్రజా సమస్యలపై జనసేనాని మాత్రమే స్పందించి ముందడుగు వేసి ఉన్నారు, మన రాష్ట్ర నాయకులకు అధికారం కావాలి, పదవులు కావాలి కానీ, ప్రజలు, నిరుద్యోగ యువత బాధలు అక్కరలేదని, పూర్తిస్థాయిలో ప్రత్యేక ప్యాకేజీని కూడా సాధించలేకపోయారు అని, ఎంతసేపు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం, అతలాకుతలం చేస్తున్నారని, కచ్చితంగా జనసేన పార్టీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే, ఈఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలరని ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ తెలియజేశారు.