డిజిటల్ క్యాంపెయిన్ లో మార్కాపురం నియోజకవర్గం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో గళమెత్తేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీమార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ గారు ప్లెకార్డ్స్ తో కూడిన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ 32 మంది ఆత్మబలిదానాలు వల్ల ఏర్పడిన విశాఖ ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని , కేవలం నష్టాల సాకుతో ప్రైవేటీకరణ చేయడం అవివేకమని తెలిపారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించెల ఒత్తిడి తీసుకురావడం జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య , సంయుక్త కార్యదర్శి N.V. సురేష్ , జనసేన పార్టీ తర్లుపాడు మండల అధ్యక్షుడు చేతుల శ్రీనివాసరావు , రత్న కుమార్ , సిరిగిరి శ్రీనివాస్ , పిన్ని బోయిన లక్ష్మీరాజ్యం , పూజ లక్ష్మి , ఇమ్మడి వెంకటేశ్వర్లు , కె.వి గౌడ్ , బెల్లంకొండ రామకృష్ణ , తాటి రమేష్ , మహబూబ్ బాషా , పోటు వెంకటేశ్వర్లు , ఖజవలి , ఇమ్మడి ఆంజన పాల్గొన్నారు.