కేసీఆర్ కు చేరిన బాలాపూర్ లడ్డూ

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది లో వచ్చిన పండుగలన్నీ కూడా కేవలం ఇళ్లకే పరిమతమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గణేష్ చతుర్థి కూడా అంతంత మాత్రoగా జరిగిoది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువ కావడంతో గణేష్ ఉత్సవాలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అదే నిర్ణయం తీసుకుంది. ఇకపోతే తెలంగాణలో ప్రసిద్ది గాంచిన ఖైరతాబాద్ గణనాయకుడు కూడా కనుమరుగయ్యాడు. భారీ విగ్రహాన్ని కాకుండా చిన్న విగ్రహంతో ఉత్సవాలను ముగించేశారు.

ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత బాలాపూర్ లోని గణేష్ ఉత్సవాలు ప్రసిద్ది. బాలాపూర్ లో కూడా కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్న విగ్రహాన్ని పెట్టారు. దాంతో పాటు ప్రతి ఏటా భారీ మొత్తంలో వేలానికి వెళ్తున్న లడ్డు వేలం ను ఈసారి నిలిపివేశారు. గత ఇరవై ఆరేళ్ళ గా ఈ లడ్డు వేలం పాట ఎప్పుడు ఆపలేదు.. అంతేకాదు ఈ లడ్డూను కొనడానికి ప్రజలు పోటీ పడతారు.1994లో మొదట 450 రూపాయలు పలికిన వేలంపాట 2019లో రూ. 17.60 లక్షలు పలికింది. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశారు.ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాలాపూర్ లడ్డూను గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందజేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో లడ్డూను సభ్యులు అందజేశారు.