ఓంటిమిట్ట గ్రామంలో డిజిటల్ క్యాంపెయిన్

రాజంపేట నియోజకవర్గంలోని ఓంటిమిట్ట మండలములో జనసేనాని, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3వ రోజు అనగా సోమవారం కోదండ స్వౌమి దగ్గర విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన ప్లకార్డులు ప్రదర్శించి చేయడం జరిగింది విశాఖ ఉక్కును సాధించడంలో ఎంతోమంది శ్రమకోర్ఛి, అనేక ఇబ్బందులు ఎదుర్కొని 32 మంది ప్రాణాలు వదిలి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు ఆత్మ గౌరవం ఆంధ్రుల ఆత్మ ఈ విశాఖ ప్రైవేటీకరించడం ఆంధ్రులను అవమానపరచడమే, కార్మికుల నోరు కొట్టడం, నిరాశ్రయులైన వారిని నట్టేట ముంచటమే అవుతుంది. కేవలం నష్టాల పేరుతో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామంటే, ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి సామాన్యుడు బతకలేని స్థితి లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ని కూడా ప్రైవేటీకరిస్తారా? చెప్పండి. విశాఖ ఉక్కుకు సొంత గనులు ఉంటే వేలకోట్ల లాభాల్లో నడిచేది. కేవలం ఈ మూడేళ్లలో పెరిగిన ధరల కారణంగా నష్టాలు చవి చూసి ఉండొచ్చు కానీ 2021లో 320 కోట్ల లాభాలతో ఉంది అంటే విశాఖ ఉక్కు నష్టాల దారిలో నడిచేది కాదని జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తెలుసుకోవాలని కోరుతున్నాం. విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి బ్రదర్ నమస్తే ప్రెస్ మీట్ కి నిరసన తెలియజేసిన ప్లకార్డులు ప్రదర్శించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఓంటిమిట్ట జనాసైనికులు కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, కొత్త మాధవరము లక్ష్మి దేవి మరియు కార్యకర్తలు, నర్సన్నగారి పల్లె వెంకటేష్ మరియు కార్యకర్తలు, తాళ్ళపాక శంకరయ్య, పోలిశెట్టి శ్రీను, సుబ్బరాయుడు రాజు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.