“జనసేన వర్క్ షాప్స్” & “బొలిశెట్టి హెల్పింగ్ హేండ్స్”

తాడేపల్లిగూడెం నియోజకవర్గం, శ్రీ శ్రీనివాస్ బొలిశెట్టి ఆశీస్సులతో, ఆయన చేతుల మీదుగా మరియు గౌరవ అధ్యక్షులు శ్రీ అడబాల నారాయణ మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రామిశెట్టి సురేష్, తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ మండల అధ్యక్షులు శ్రీ వర్తనపల్లి కాశీ, శ్రీ అడపా ప్రసాద్, శ్రీ పుల్లా బాబి, శ్రీ గుండెమోగుల సురేష్ ల చేతుల మీదుగా “జనసేన మహిళ శక్తి” ని ప్రారంభిన తాడేపల్లిగూడెం వీరమహిళా చైర్మన్ కసిరెడ్డి మధులత. “జనసేన వర్క్ షాప్స్” & “బొలిశెట్టి హెల్పింగ్ హేండ్స్” అనే నిరంతర కార్యక్రమాలు ఈ జనసేన మహిళాశక్తిలో భాగాలుగా ఉంటాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ మండల గ్రామాల్లో మూల ప్రాంతాలలో కూడా జనసేన పార్టీ బలోపేతం చేయడానికి అన్ని గ్రామాల్లో ప్రణాళిక బద్ధంగా నెలకి నాలుగు జనసేన వర్క్ షాప్ క్లాసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అభిమానిని కార్యకర్తలుగా తీర్చి దిద్దడం, కార్యకర్తలని ప్రజా సమస్యలు ఎలా గుర్తించి పరిష్కరించాలి, ఓటు బ్యాంకింగ్ ని ఎలా పెంచుకోవాలి అనే ముఖ్య విషయాలపై మండల అధ్యక్షుల అధ్యక్షతన ఈ క్లాసులు జరుగుతాయి. రాష్ట్రంలో జనసేన భావజాలాన్ని పరిపూర్ణంగా పునికిపుచుకున్న కొంతమంది వక్తలతో ఈ క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ఈ జనసేన వర్క్ షాప్స్ తో గ్రామ గ్రామంలో తిరిగే క్రమంలో ఆ గ్రామంలో ఎవరికైనా సహాయం అత్యవసరం అయినప్పడు.. బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఆ కష్టంలో ఉన్న వారికి సహాయం అందిస్తాము. జనసేన వర్క్ షాప్స్ & బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ రెండు అనుసంధానమై ముందుకు వెళ్లడం జరుగుతుంది. జనసేన 7 సిద్ధాంతాలను ఆచరిస్తూ జనసేన విజయానికి కష్టపడి ముందుకు పోవాలి అనే మహిళా విభాగం ఆలోచనకి కార్యరూపం దాల్చి విజయం సాధిస్తారని కోరుకుంటున్నామని తాడేపల్లిగూడెం జనసేన వీరమహిళా విభాగం తెలిపారు.