ఖమ్మం జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం

తెలంగాణలో రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసి, విద్యార్థుల మరణాలకు కారణమైన ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ జనసేన విద్యార్థి విభాగం మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన “జూనియర్ కళాశాలల బంద్” కు జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కొండ పవన్ కుమార్ నేతృత్వం వహించారు. స్థానిక నయబజార్ కాలేజ్ నుండి RJC కాలేజ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇంటర్ బోర్డ్ నిర్వాకం వలన నష్ట పోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరు గారిని కోరడం జరిగింది. గతంలో కూడా ఇదే ఇంటర్ బోర్డ్ అవకతవకల వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మున్ముందు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ సురభి సూరజ్ కిరణ్, విద్యార్థి విభాగం ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్, వంశీ, చంద్ పాషా, ఉదయ్, ఎక్జిక్యూటివ్ మెంబర్స్ గంధం ఆనంద్, వేముల వినయ్, వికాస్, రామ్ రాజ్, పవన్, శ్రీకాంత్, ఖమ్మం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కార్తిక్, ఉపాధ్యక్షుడు అజయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మణికంఠ, ఎక్జిక్యూటివ్ మెంబర్ గుండ్ల పవన్ కళ్యాణ్, ప్రభాకర్, వెంకట్, సంజయ్, ఆనంద్ తదితరులు విద్యార్థులు పాల్గొనీ కాలేజ్ ల బంద్ విజయవంతం చేశారు.