జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ కు సన్మానం

మానవ సేవే మాధవ సేవ అన్న ఆనాటి మహానుభావుల అడుగుజాడలలో నడుస్తూ కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు ఐనవోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా సమయంలో తన సేవలు అందించి అందరి మన్ననలు పొందిన మండల అధ్యక్షుడు బర్ల శివ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఐనవోలు మండలంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జనసేన నాయకులు గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అయితే ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్స్ యొక్క సేవలను గుర్తించి వారిని మర్యాదపూర్వకంగా సన్మానం చేయాలని నిర్ణయించాము అన్నారు. ఇలాంటి సేవ కార్యక్రమలు చేపట్టడానికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నేమురి శంకర్ గౌడ్, ఉప అధ్యక్షుడు శ్రీ మహేందర్ రెడ్డి మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ ఆకుల సుమన్ లు అందించిన ప్రోత్సాహం మరువలేనిది అన్నారు. వర్ధనపేట్, ఐనవోలు జనసేన బృందం సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తోడ్పడ్డాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు ఉమేష్, వై.శ్రీకాంత్, ఈ.అఖిల్, ఎం.రాకేష్, సాంబరాజు, హరికృష్ణ ,రాకేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.