వికలాంగులను విస్మరించిన సీఎంకు పుట్టగత్తులుండవు.. జనసేన అండగా నిలుస్తుంది.!

-జెఎస్పి వ్యవహారాల ఇంచార్జీ, పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్.

ఎమ్మిగనూరు 22వ తేదీ, మంగళవారం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మిగనూరు తాలుకా “విహెచ్పిఎస్” ఆర్గనైజింగ్ కార్యదర్శి, జెఎస్పి నాయకులు బి.సి. నాగరాజు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎపి జనసేన పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ని జిల్లా “వికలాంగుల సంక్షేమ హక్కుల సాధన సంఘాల ఐక్య వేదిక” ఆధ్వర్యంలో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై, ఇబ్బందులపై, అలాగే ఈ ప్రజా పాలక వైసీపీ ప్రభుత్వం వికలాంగులు సంక్షేమాభివృద్ధి గావించుకోవడానికి సంక్షేమ శాఖ మరియు కార్పోరేషన్లకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా 4%రిజర్వేషన్ ప్రకారం కేటాయించవలసిన నిధులు(బడ్జెట్) కేటాయించక పోవడం గూర్చి, వికలాంగుల ప్రధాన డిమాండ్లైన ఫించన్ల పెంపు, సబ్సిడీ బ్యాంకు రుణాలు, మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు, త్రీవీలర్ స్కూటీలు, వికలాంగుల సంక్షేమ హోం, మౌలిక సదుపాయాల, సదుపాయాల కల్పన తదితర అంశాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ఆయన దృష్టికి తీసుకెళ్తు మెమోరాండం సమర్పించడం జరిగిందని,
ఈ కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వికలాంగులను విస్మరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంక్షేమ సమస్యలపై, ఇబ్బందులపై ప్రభుత్వ తీరుపై సంక్షేమ సంఘాల నాయకులతో, కార్యకర్తలతో శ్రీ పవన్ కళ్యాణ్ తో ముఖ్య సమావేశం నిర్వహిస్తామని, ఇకనైనా ఈ అధికారికయంత్రాంగ ప్రభుత్వం తక్షణమే స్పందించి వికలాంగుల సంక్షేమ హక్కులను నెరవేర్చాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ వికలాంగులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెఎన్ఎల్ పిడబ్ల్య్ డి జెఎసి అధ్యక్షులు ఎస్. లక్ష్మణ స్వామి, ప్యార ఒలింపిక్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రామాంజనేయులు, ఉపాధ్యక్షులు ఎం. గోపాల్, మనోహర్, జిల్లా కార్యదర్శి మక్బుల్ భాషా, రాజేంద్ర, కె. వీరేశ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.