అర్హులైన లబ్ధిదారులకు పింఛను అందకపోవడం ప్రభుత్వ వైఫల్యం: జనసేన

చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, మంగళం పంచాయతీ, గిరిప్రసాధ్ కాలానికి చెందిన అలిమేలు దంపతులు కటిక పేదరికంలో జీవనం సాగిస్తుండగా క్రితం కురిసిన భారీ వర్షాలకు ఇంటి పైకప్పు మొత్తం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అందులో ఇద్దరు వృద్ధులు, ఆయనకు అంగవైకల్యం మరియు ఉన్న ఒక్క కుమారుడికి మతిస్థిమితం బాగొలేకపోవడం బాధాకరం. వీరికి మూడు నెలలు సరిపడ బియ్యం బస్తాలు, ముడి సరుకులను అందచేయడం జరిగింది మరియు అర్హులైన లబ్ధిదారులైనప్పటికీ ప్రభుత్వం నుండి రావాల్సిన పింఛను అందకపోవడంతో వారికి అండగా ఉండి వారి తరపున స్థానిక ప్రభుత్వ అధికారులతో మాట్లాడి లబ్ధి పొందేలా చేస్తానని నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వివేక్ బాబు మాట్లాడుతూ అర్హులైనప్పటికి వారికి పింఛను అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందని వారికి తక్షణమే న్యాయం చేకురేల చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే కటిక పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఎవరైనా దాతలు ఆదుకోవాల్సినదిగా ఆకాంక్షించారు మరియు వారికి ప్రస్తుతానికి ఉండటానికి నివాసాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వివేక్ బాబు , రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కార్యదర్శి చంద్రగిరి నాయకులు దేవర మనోహర్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.