నిబద్దత కలిగిన సేనతో మార్పు సాద్యం వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం తద్యం

పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే క్షణాల్లో జన ప్రభంజనం, ప్రత్యర్థుల గుండెల్లో ప్రకంపనాల మోత మొగుద్ది, రాజకీయ సమీకరణాలలో పెను మార్పులు సంభవిస్తాయి. ఇది ముమ్మాటికీ అక్షర నిజం అని అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా ఋజువు అయింది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్, తాను నిలుచున్న చోటనుంచే విప్లాత్మకమైన మార్పులు క్షణాల్లో సాధించగల రాజకీయ తత్పరుడు, సామాన్య ప్రజల కష్టాలు తీర్చడానికి అనునిత్యం శ్రమిస్తూ పరితపించే నాయకుడు. కొన్ని దశబ్దాలుగా అధికారం కొందరికే పరిమితం అయిపోయి రాజ్యాంగం కల్పించిన రాజకీయ ప్రాధమిక హక్కులను కలరాస్తూ కొన్ని సామజికవర్గాలను రాజకీయ బానిసలను చేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు, ఈ రాజకీయ జాగిదారుల(రజాకార్ల) కబ్జా చెర నుండి బంధ విముక్తి జరగాలంటే రబ్బరు చెప్పులు వేసుకున్న సామాన్యమైన వ్యక్తులతో రాజకీయం చేయించాలని బహిరంగ సభల్లో ప్రకటించి ఆచరణ సాధ్యమని చేసి చూపిన రాజకీయ ప్రజ్ఞాశాలి, రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నిలబడి గెలిచిన వార్డు సభ్యుల దగ్గర నుండి ఎంపీటీసీల వరక ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీ లుగా ఎన్నికైన సామాన్యులే దీనికి సమాధానం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం దైర్యంగా నిలబడి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వలపై నిరసనగళం వినిపించిన ప్రజా నాయకుడు. సొంత పార్టీ స్థాపించి ధన రహిత(జీరో బడ్జెట్ పొలిటిక్స్) రాజకీయాలకు తెరలేపి దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా తొలి ప్రయత్నంలోనే సుమారు ఇరవై లక్షల మంది జనాభాలో మార్పు తీసుకు వచ్చిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు సేనాని, ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తూ మంచి ఆలోచనలతో సరికొత్త విధానాలను రూపొందిస్తూ ముఖ్యంగా విద్య, వైద్యం మరియు ఆర్ధిక వ్యవస్థలలో అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు, ప్రజా సమస్యలపై తాను గళం ఎత్తిన ప్రతీసారీ ప్రత్యర్ధుల చేతిలో వ్యక్తిత్వ హననంకి గురవుతున్నా సరే లెక్క చేయక మొక్కవోని దీక్షతో ప్రజలపక్షాన నిలబడుతున్న ధీనబాంధవుడు. రాజకీయ ప్రత్యర్ధులు అధికార మదంతో తన ఆర్థిక మూలాల మీద దాడులు చేస్తున్నా తలవంచక తాను ఎత్తిన జెండా దించక ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం నడుము బిగించి కదం తొక్కిన ఉక్కు మనిషి జనసేనాని. ఇటీవలి కాలంలో కొంత మంది రాజకీయ కురువృద్దులు చిరంజీవి, పవన్ రాజకీయంగా విఫలం అయ్యారని పొంతన లేని వ్యాఖ్యలు చేశారు. వారిని సూటిగా ఒకే ఒక ప్రశ్న ఆడుతున్నాం ప్రతికూల పరిస్థతుల్లో సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించి ఎన్ని ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు? ఎన్ని విజయాలు సాధించారు..? వారి వ్యాఖ్యలు వారి విజ్ఞతకు వదిలేద్దాం. అయితే జనసైనికులారా ఒక విన్నపము మన్నించి అర్దం చేసుకుంటారని భావిస్తున్నాము. నిబద్దత అనే బ్రహ్మాస్త్రాన్ని మనం అందరం కలిసి ఉపయోగిద్దాము. మన ప్రత్యర్ధి పార్టీలలో ఉన్న నాయకులు ఎంతటి అవినీతిపరులో అందరికీ తెలిసిందే కదా, వెన్నుపోటు రాజకీయాల నుంచి ఆర్ధిక దోపిడీ వరకు ఆయా పార్టీల కార్యకర్తలకు తెలియదు అంటారా? పక్కాగా… ప్రతీది తెలుసు అయినా సరే తమ నాయకుడిని సమర్థించుకుంటారు. వాళ్ళ నాయకుడు అవినీతి పరుడు అబద్దాల పుట్ట అని తెలిసినా నాయకుడు పందిని చూపించి నంది అనమంటే నందే అని అంటారు అదే నాయకుడు పంది అని చెప్పితే ఎందుకూ, ఏమిటి అని కూడా మారు మాట్లాడకుండా పందె అని అంటారు, అది వారి నాయకుడి మీద నమ్మకం పార్టీ మీద ఉన్న నిబద్దత కాబట్టి వాళ్ల నాయకులు ఎంత అవినీతి పరులు అయినా అధికారం చేజిక్కించుకుంటున్నారు. అవును అంటారా కాదంటారా? నిజాయతీ పరుడు అవినీతి మచ్చలేని నాయకుడు మనకోసం అన్నీ వదిలేసి వస్తే మనం ఏమి చేస్తున్నాము? చేతిలో సెల్ ఫోన్ అందులో మొబైల్ డేటా ఉంటే చాలు పార్టీని ఎలా నడపాలో అధినేతకే సలహాలు ఇచ్చేస్తుంటాం. ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఉన్న ప్రింట్, ఎలక్ట్రాన్ మీడియా మన పార్టీకి ఏమాత్రం సహకరించడం లేదు తిరిగి మన అదినేత మీద మన జనసేన పార్టీ మీద వ్యతిరేకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏటువంటి అండదండలు లేకుండ కేవలం ప్రజా ఆదరణతో మాత్రమే పార్టీని ముందుకు నడపటం ఎంత కష్టతరమో ఒక్క క్షణం మనసు పెట్టీ ఆలోచన చేద్దాం. మన నోటి నుండి వచ్చే మాట ఆయుధం కంటే వెయ్యి రెట్లు అధికంగా బలమైంది కావున మనం మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి, మనం అందరం కలిసి నిబద్దతతో క్రమశిక్షణ కలిగి ప్రజలతో మమేకమై ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేస్తూ ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని బలమైన రాజకీయ పార్టీగా ఆవిష్కరించ వలసిన బాధ్యత మన అందరిదీ అందుకే రండి తరలి రండి చేయి చేయి కలుపుదాం సేనాని ఆలోచనలను సమర్ధిస్తూ ఆయన ఆశయాలను భుజాన వేసుకుని మద్దతు తెలుపుతూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా మన గళం విప్పి ప్రజా బలాన్ని చేకూర్చుదాం.

పల్లె పల్లెకు జనసేన జెండా
నిబద్ధతతో పని చేద్దాం విజయం సాదిద్దాం
సేనాని నిర్ణయమే మనకి శిరోధార్యం
పవన్ అన్న రావాలి పాలన మారాలి