వాల్మీకిల సమస్యలపై వినతిపత్రం అందించిన జక్కుల శ్రీనివాసరావు

హైదరాబాదులో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గౌరవ శ్రీ G.రామదాసు చౌదరి రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాసరావు మరియు రాష్ట్ర వాల్మీకి నాయకులు సాంబన్న వాల్మీకి కలిసి వాల్మీకి బోయలకు సంబంధించిన ST రిజర్వేషన్ పై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. త్వరలోనే గౌరవ G.రామదాసు చౌదరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ రాయలసీమ జిల్లాల్లో పర్యటన చేసి గ్రౌండ్ లెవల్లో బోయల స్థితిగతులపై సమగ్ర రిపోర్ట్ తయారు చేసి పార్టీకి మరియు కేంద్ర ప్రభుత్వంకు పంపించి జనసేన పార్టీ వాల్మీకి బోయలకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేశారు. అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయల తరుపున జనసేన పార్టీ అధినాయకత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జక్కుల శ్రీనివాసరావు.