జనసేన ఆధ్వర్యంలో సావిత్రి బాయి జయంతి వేడుకలు

చదువుల తల్లి బిసి చైతన్య మహిళ ఉద్యమ మూర్తి సావిత్రి బాయి ఫూలే గారి జయంతి సందర్భంగా భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర గల చాకలి ఐలమ్మ గద్దె వద్ద సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు జనసేన పార్టీ, బిసి సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే ఆధునిక భారతంలో ఆది సరస్వతి, చదువుల తల్లి, భారతీయ మొదటి ఉపాధ్యాయురాలు, బహుజన భారత మాత, విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన మహిళ ఉద్యమ కారిణి, బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఆగ్రవర్ణాలు ఎన్నో భౌతిక దాడులకు పూనుకున్నా సమాజం కోసం ముందుకు సాగిన వీరమహిళ, వితంతువులకు శిరో ముండనం చేయవద్దని, బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు, వితంతువు పునర్వివాహం కోసం శ్రమించారు. ఇలాంటి ఆదర్శ మూర్తిని ఈ సమాజం మరవద్దని, బిసిల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని కోరుతున్నాం అని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం తాలులా అధ్యక్షులు మరియు జనసేన నాయకులు సుంకెట పోశెట్టి, కిషన్, గంగాధర్ వార్లే, బాలాజీ పటేల్, దళిత, భౌద్ధ, బహుజన, భీం ఆర్మీ నాయకులు జనార్ధన్ అమడే, గంగాధర్ ఉమాడే, యశ్వంత్ బాన్సొడే, కత్తిబాబు, లక్ష్మణ్ వాడేకర్, సాహెబ్ రావ్ జంగ్మే, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.