అత్యాచారానికి గురైన బాలికలకు అండగా నిలబడిన పాడేరు జనసేన

కొత్త సంవత్సరం రోజున స్నేహితులతో సరదాగా గడుపుదామని వెళ్లిన ఇద్దరు గిరిజన బాలికలపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. జనసేన నాయకులు చెప్పిన వివరాలు ప్రకారం ఈ ఘటన విజయనగరం జిల్లా జియమ్మవలస మండలం రవాడలో చోటు చేసుకుంది. ఇది ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి పుష్ప శ్రీవాణిసొంత నియోజకవర్గం కురుపాం పరిధిలోకి వస్తుంది. వివరాల్లోకి వెళితే కురూపంలో ఓ వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు బాలికలు కొత్తసంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 9గంటలకు ఇద్దరు స్నేహితులతో(బాలురు) కలిసి రావాడ వద్దనున్న వట్టిగెడ్డ జలాశయానికి వెళ్లారు, మధ్యాహ్నం రెండింటి వరకు సరదాగా గడిపితిరిగి పయనమయ్యారు వీరిని గమనించిన చినమేరంగి వాసి వెలగాడ రాంబాబు బాలికలను వెంబడించటం జరిగింది. కురూపం పంచాయతీ బేకరకండి సమీపంలోని పామాయిల్ తోట వద్ద నలుగురిని అడ్డుకొని తాను పోలీసునని, ఒకసారి ఒకసారి ప్రెస్, అనిమరో సారి చెప్పి బెదిరించాడు అబ్బాయిలను అక్కడే ఉంచి ఇద్దరు బాలికలను తన ద్విచక్రవాహనంపై తోటలోకి తీసుకెళ్లాడు. ఒకరి తర్వాత మరొకరి పై అత్యాచారానికి పాల్పడ్డాడు విషయం బయటకి చెపితే వీడియోలను సామాజికమాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి పంపించేశాడు. మధ్యలో ఎవరికైనా చెబుతారనే అనుమానంతో వసతి గృహం వరకు వెనుకే వచ్చాడు. అతడు అక్కడ నుంచి వెళ్ళిపోయాక బాలికలు కళాశాల అధ్యాపకులకు, సంరక్షకురాలికి సమాచారమిచ్చారు. రాత్రి8:15 గంటలకు విషయం తెలియడంతో ఎస్పి దీపికా ఎం.పాటిల్ దృష్టికి పోలీసులు తీసుకెళ్లgA, పోలీసులు గాలించి నిందితుడిని పట్టుకున్నారు బాలికలను పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి పంపించారు. బాలికలకు అధికార పార్టీ వైసీపీ మంత్రి పుష్ప శ్రీవాణి న్యాయం చెయ్యాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేయటం జరిగింది. మీరు తీసుకొని వచ్చిన దిశ చట్టం ఎక్కడకు పోయింది అని అడుగుతున్నాం అలాగే సమాజంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది అలాగే తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలబడాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకొవాలని వైసీపీ పార్టీకి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటాదని తెలియచేశారు. బాధితులకు
అండగా నిరసన కార్యక్రమం తెలియజేసిన పాడేరు జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ నందోలి మురళి కృష్ణ, అలాగే జీ. మాడుగుల జనసేన పార్టీమండల ప్రెసిడెంట్ మసాడి బీమన్న, అలాగే జనసేన పార్టీ జీ. మాడుగుల నాయకులు మసాడి సింహాచలం, ex.ఎంపీటీసీ, జీ. మాడుగుల మండల యూత్ ప్రెసిడెంట్ మస్తాన్, అలాగే పాడేరు నాయకులు రాజు అలాగే కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు అనిల్ కుమార్ జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.